24 గంటల్లో 20 పిల్లలకు జన్మ..

Bull Dog Gives Birth To 20 Pups In 24 Hours In London - Sakshi

లండన్‌ : ఇంగ్లాండ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క 24 గంటల్లో 20 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని స్విన్‌డన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్విన్‌డన్‌ విల్ట్‌షైర్‌కు చెందిన ఆంబర్‌ రీస్‌ అనే వ్యక్తి  కాలి అనే బుల్‌డాగ్‌ను పెంచుకుంటున్నాడు. గర్భంతో ఉన్న కాలి మార్చి 11 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ పిల్లకు జన్మనిచ్చింది. అలా రాత్రి 12.50గంటల వరకు వరుసగా 12 పిల్లలకు జన్మనిచ్చింది.

కాలి(ఎడమ)

గురువారం మధ్యాహ్నం సమయానికి మరో ఎనిమిదిటికి జన్మనిచ్చింది. ఆరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుందని భావించిన ఆంబర్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలా ఓ కుక్క 20 పిల్లలకు జన్మనివ్వటం అరుదైన సంఘటనా పేర్కొన్నాడు. అయితే దురదృష్టవశాత్తు వీటిలో తొమ్మిది పిల్లలు మృత్యువాత పడ్డాయని, మిగిలిన 11 క్షేమంగా ఉన్నాయని తెలిపాడు. కాలి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించాడు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top