ట్రంప్‌ మధ్యవర్తిత్వం: కొట్టిపారేసిన చైనా

China Rejects Donald Trump Meditation - Sakshi

బీజింగ్‌ : భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌​ ప్రతిపాదనను చైనా కొట్టిపారేసింది.ఇరు దేశాల మధ్య థర్డ్‌పార్టీ (మూడో వ్యక్తి) జోక్యం అవసరంలేదని డ్రాగన్‌ దేశం తేల్చిచెప్పింది. భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే శక్తీసామర్థ్యాలు తమకు (ఇరుదేశాలకు) ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు దేశాలైన తమ మధ్య డొనాల్డ్‌ ట్రంప్‌ తన దూర్చాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్‌ మధ్యవర్తి‍త్వ ప్రతిపాదనపై చైనా స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. (భారత్‌-చైనా వివాదం: యూఎన్‌ఓ జోక్యం)

కాగా లదా‌ఖ్ లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు భార‌త్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయ‌త్నం చేయ‌డంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య తాను మ‌ధ్యవ‌ర్తిత్వం చేస్తానంటూ డొనాల్డ్‌ ట్రంప్ ట్విటర్‌ ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే భారత ప్రధానమంతత్రి నరేంద్ర మోదీనీ తాను సంప్రదించానని, దానిని ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ ట్రంప్‌ చెప్పారు. ఈ నేపథ్యంలోనే భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరగలేదని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. (ట్రంప్‌ మధ్యవర్తిత్వం పెద్ద జోక్)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top