ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

Couple Kissed And Photographed Themselves After Shooting Lion - Sakshi

నేలకొరిగిన భారీ మృగరాజు ఎదుట ఇలా గాఢంగా ముద్దు పెట్టుకున్నారు కెనడా దంపతులు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదేం పోయేంకాలం? ఇంత వికృతమా? ఇంత దారుణమా? మీరు మనుషులేనా? మీకు మానవత్వముందా? అంటూ నెటిజన్లు ఆ దంపతుల మీద మండిపడుతున్నారు. జంతు ప్రేమికులైతే వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మీరు దారుణమైన మనుషులు.. ఆ అందమైన సింహం మిమ్మల్ని తిని ఉంటే బాగుండేదని నెటిజన్లు వారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. 

వారి ఆగ్రహానికి కారణం లేకపోలేదు. కెనడాలోని అల్బెర్ట్‌కు చెందిన డారెన్‌, కారోలిన్‌ కార్టర్‌ దంపతులు ఈ సింహాన్ని స్వయంగా వేటాడారు. వేటాడి చంపిన అనంతరం  సింహం కళేబరం పక్కనే ఇలా గర్వంగా, ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫొటోను లెజెలేలా సఫారీ అనే కంపెనీ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. అడవిలో సింహాలు, జిరాఫీలు మొదలుకొని.. అనేక రకాల జంతువులను వేటాడి చంపేందుకు అనుమతిస్తుంది. అంటే అడవిలో వేట ఇష్టపడే ఔత్సాహికులు.. ఈ కంపెనీని ఆశ్రయిస్తే.. ఎంచక్కా చట్టపరమైన చిక్కులు లేకుండా ఆ అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. 

‘కలహారి ఏడారిలో అడవి మృగరాజును వేటాడటం కంటే మరో గొప్ప అనుభూతి మరొకటి ఉండదు’ అంటూ  లెజెలేలా సఫారీ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఈ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోపై ఆన్‌లైన్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు, దూషణలు వ్యక్తం కావడంతో సదరు కెనడా దంపతులు తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలను ప్రైవేట్‌ చేశారు. లెజెలేలా సఫారీ తన ఫేస్‌బుక్‌ పేజీని తొలగించింది. అయితే, వేటను వ్యాపారంగా చేస్తున్న తమ కంపెనీ వ్యవహారాలు ఇకపై కొనసాగుతాయని, ఔత్సాహికులకు ఇకముందు కూడా మెరుగైన సేవలందిస్తామని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top