పిల్లాడి ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్‌

Delivery Boy Saves Toddler Life In China - Sakshi

బీజింగ్‌ : భవనం రెండవ అంతస్తుపై నుంచి కిందకు వేలాడుతున్న పిల్లాడిని రక్షించటానికి ఓ డెలివరీ బాయ్‌ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఎలాంటి రక్షణ లేకుండా రెండు అంతస్తులను చకచకా ఎక్కి పిల్లాడిని కాపాడాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం చైనా, గాంగ్‌ఝౌ ప్రాంతంలోని ఓ భవనం రెండవ అంతస్తులో ఆడుకుంటున్న పిల్లాడు పొరపాటున రక్షణ చువ్వలను దాటుకుని కిందకు వేలాడాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు బాలుడ్ని పైకి లాగటానికి ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. చివరకు పట్టుతప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న లి జియాజున్‌ అనే డెలివరీ బాయ్‌ వెంటనే రెండు అంతస్తులపైకి ఎగబాకాడు. ( సింహాలు కూడా ఉహించని ట్విస్ట్‌! )

పిల్లాడిని పట్టుకుని పైకి తోసాడు. కుటుంబసభ్యులు చిన్నారిని పైకి లాక్కోవడంతో గండం తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు.. ‘‘రియల్‌ హీరో.. డెలివరీ బాయ్‌ నిజంగా దేవుడు’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం‘‘  చైనా కరోనాను వ్యాప్తి చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మమ్మల్ని డైవర్ట్‌ చేయటానికి మంచి ప్రయత్నమే చేశారు’’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ( ‘ఎవ్వడంట... ఎవ్వడంట’ మాటల్లేవ్‌ బాస్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top