టెస్లా సీఈవో స్టెప్పులు, వీడియో వైరల్‌

Elon Musk says will design a future Tesla car in China for global market - Sakshi

టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్‌ మస్క్‌ (48)మరోసారి వార్తల్లో నిలిచారు.  అమెరికాకు చెందిన ఈ ఎలక్ట్రిక్‌ కార్‌ మేకర్‌ చైనాలో ఈ సారి స్టెప్పులతో  ఆకట్టుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్‌లో చక్కర్లు కొడుతోంది. చైనాలోని షాంఘైలోని తన కంపెనీ ప్లాంట్‌లో  పెద్ద సంఖ్యలో మోడల్ 3 కార్లను వినియోగదారులకు అందిస్తూ మంగళవారం ఉత్సాహంగా డాన్స్‌ చేశారు. గ్లోబల్ మార్కెట్ కోసం చైనాలో భవిష్యత్ టెస్లా కారును డిజైన్ చేస్తామని ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ చెప్పారు

చైనా తయారు చేసిన టెస్లా వాహనాల మొదటి డెలివరీ సందర్బంగా టెస్లా గిగా ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చేసిన ఆయన విన్యాసాలను స్వయంగా  ట్విటర్‌లో ఆయన షేర్‌ చేశారు. అరగంట వ్యవధిలో ఈ వీడియో 30 వేల 'లైక్'  లు సాధించింది. వినోదభరితమైన ఆసర్తికరమైన వ్యాఖ్యలతో   రీట్వీట్లు, 110.8వేలకుపైగా  లైక్స్‌తో  హల్‌ చల్‌ చేస్తోంది. "మార్కెటింగ్ మేధావి". "హ్యాపీ డాన్స్ !!! అన్న కమెంట్లు వెల్లువెత్తాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top