విమానంలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి

Fire Accident In Plane And 41 died In Russia - Sakshi

మాస్కో : అకస్మాత్తుగా విమానంలో చెలరేగిన మంటల్లో దాదాపు 41 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం.. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌ వల్ల నేలకు బలంగా తాకింది. దీనివల్లే విమానంలో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top