‘అవి నెట్‌ఫ్లిక్స్‌ సెట్టింగ్స్‌ అనుకున్నాను’

Girl Hacks Ex Boyfriend Netflix Account - Sakshi

మామూలుగా మనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత‌ విషయాలు, ఫేస్‌బుక్‌ లేదా ఇతర మూవీ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌లకు చెందిన అకౌంట్ల వివరాలు బాగా దగ్గరైన వారితోనే పంచుకుంటాం. వారు మన అకౌంట్లను వాడుతారని మనకు తెలుసు. కానీ, మనుషుల మధ్య దూరం పెరిగినా కూడా కొంతమంది మాత్రం మన అకౌంట్లను హ్యాక్‌ చేసి మరీ వాడుకుంటుంటారు. ఈ కోవకు చెందిందే ఈ యువతి. అయితే మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేయటానికి సదరు యువతి చేసిన పనిని ఇంటర్‌నెట్‌ మొత్తం ఆశ్చర్యపోయి చూసింది. వివరాల్లోకి వెళితే.. బ్రూ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తమ నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌కు సంబంధించిన హోమ్‌ పేజ్‌ స్ర్కీన్‌ షాట్‌ను ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ‘‘ నా సోదరుడి మాజీ ప్రియురాలు మా నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ను రెండు నెలలుగా దొంగిలిస్తోంది. ( మానవత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఈ వ్యక్తి! )

హోమ్‌ పేజీలో తన అకౌంట్‌ పేరును ‘‘సెట్టింగ్స్’’‌ అని పెట్టుకుంది. నేను కూడా అవి నెట్‌ఫ్లిక్స్‌ సెట్టింగ్స్‌ అనుకున్నాను. తీరా అది ఓ అకౌంట్‌ అని తెలిసి చాలా నిరాశ చెందాను’’ అని పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు హ్యాకర్‌ అమ్మాయి తెలివికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘‘ హ్యాకింగ్‌ యువరాణి.. ఇంతకీ ఆ యాడ్‌ ప్రొఫైల్‌ ఎవరు?.. ఆమెను అకౌంట్‌ వాడుకోనివ్వండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఆస్ప‌త్రిలో ఒక్క‌టైన డాక్ట‌ర్, న‌ర్స్‌ )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top