వైరల్‌: క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..

Horrifying Video Python Strangling Deer In Thailand - Sakshi

బ్యాంకాక్: అడవిలో ఉండే చిన్న జంతువులు, పక్షులను  భారీ కొండ చిలువలు నిమిషాల వ్యవధిలో మింగేస్తాయనడంలో ఎటువంటి సందేహం​ లేదు. కొండ చిలువ బారినపడి ప్రాణాలతో బయటపడటం అంత సులభం కాదు. అంత దృఢంగా అవి మనుషుల్ని, జంతువులన్ని పట్టేసుకుంటాయి. అయితే, కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ఓ జింక క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను డుసిత్ జూ అసిస్టెంట్ డైరెక్టర్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. థాయ్‌లాండ్‌లోని ఖావో ఖేవ్ ఓపెన్ జూలో తీసినట్లు తెలిపారు. ఈ వీడియో​ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. (విక‌లాంగుడికి శున‌కం అండ‌)

ఓ భారీ పైథాన్‌ ఓపన్‌ జూలో ఉన్న ఓ రోడ్డుపై నుంచి వెళ్తున్న చిన్న జింక పిల్లను చుట్టుకొని మింగేయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు చెట్టు కొమ్మతో కొండచిలువను కొట్టడంతో కోపంతో ఒక్కసారిగా అతనిపై దాడి చేయబోయింది. ఇక యువకుడు మరోసారి కొట్టడంతో భయంతో కొండ చిలువ జింకను వదిలి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో జింక బతికిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ అత్యంత దారుణమైన ప్రమాదం నుంచి జింక క్షేమంగా బయటపడింది’అని కామెంట్లు చేస్తున్నారు. ‘వీడియోను చూస్తున్నంత సేపు ఆ పైథాన్‌ జింకను మింగిస్తుందేమో అన్న భయం కలిగింది’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఈ వీడియోను 9. 4 లక్షల మంది వీక్షించగా, 17 వేల మంది లైక్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top