రాకెట్‌ ప్రమాదంలో ‘మ్యాడ్‌ మైక్‌’ దుర్మరణం 

Mad Mike Hughes Dies After Crash Landing Rocket - Sakshi

లాస్‌ఏంజెలెస్‌ : భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్‌ ‘మ్యాడ్‌ మైక్‌’హ్యూస్‌.. ఈ నెల 22న ఓ రాకెట్‌ ప్రమాదంలో మరణించారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్‌ రాకెట్‌తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. దాదాపు భూమికి 1,500 మీటర్ల ఎత్తుకు వెళ్లాలన్నది తన కోరిక అని చెప్పారు. అక్కడికి వెళ్లి భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా, గుండ్రటి డిస్క్‌ మాదిరిగా ఉంటుందని నిరూపిస్తానని పేర్కొన్నారు. కానీ కిందకు దిగకుండానే ఆయన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top