పీఏ బర్త్‌డేకు బెంజ్‌ కారు గిఫ్ట్‌..

Madison Beer STUNS Personal Assistant By Giving Her A Mercedes - Sakshi

లండన్‌ : పీఏ బర్త్‌డే అంటే మహా అయితే కేక్‌ కట్‌ చేసి చిన్న పార్టీ ఇవ్వడమే గొప్ప అనుకునే రోజుల్లో పాటల సంచలనం మాడిసన్‌ బీర్‌ తన పీఏ 30వ బర్త్‌డే సందర్భంగా మరిచిపోలేని గిఫ్ట్‌ను ఆమెకు బహుకరించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. పీఏ జన్మదినం సందర్భంగా లంచ్‌ ఏర్పాటు చేసిన మాడిసన్‌ అనంతరం ఆమెకు న్యూ మెర్సిడెస్‌ బెంజ్‌ సీ 300ను కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు.

మెర్సిడస్‌ కారును సొంతం చేసుకోవాలన్న తన పీఏ కలను మాడిసన్‌ ఇలా నిజం చేశారు. 12 ఏళ్ల పాత కారుతో తన పీఏ ఇబ్బంది పడటాన్ని స్వయంగా వీక్షించిన మాడిసన్‌ రూ 30 లక్షల విలవైన గిఫ్ట్‌తో ఆమెను షాక్‌లో ముంచెత్తారు. 13 ఏళ్ల వయసులోనే మాడిసన్‌కు గాయనిగా గుర్తింపు లభించింది. యూట్యూబ్‌ వీడియోలు 20 ఏళ్ల యువ గాయనికి తిరుగులేని బ్రేక్‌ ఇచ్చాయి.

చదవండి : బెంజ్‌ కంపెనీ నుంచి ‘అవతార్‌’ కారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top