బర్త్‌ డే: కేక్‌ తీసి సింహం ముఖానికి కొట్టాడు

Man Celebrates His Pet Lion Birthday With Cake Smash, Slammed by Netizens - Sakshi

అతను ఓ సింహాన్ని పెంచుకున్నాడు. ఆ సింహానికి పుట్టినరోజు చేయాలనుకున్నాడు. అందుకోసం స్నేహితులను కూడా పిలిచాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత మూర్ఖంగా ప్రవర్తించాడు. పెంచుకుంటున్న సింహమే కదా? దాని పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. హ్యాపీ బర్త్‌ డే టు యూ అంటూ తాను తెచ్చిన కేక్‌ను సింహం ముఖానికి కేసి కొట్టాడు. దాంతో ఆ సింహం అదిరిపదింది. ముఖానికి అంటిన కేక్‌ను దులుపుకుంటూ.. అసహనంగా కదిలింది. పెంపుడు సింహం ఇలా ఇబ్బంది పడుతుంటే.. సదరు యజమాని, అతని స్నేహితులు మాత్రం ఇదేదో వినోదమైనట్టు నవ్వుల్లో మునిగిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కుర్దీస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దంటూ జంతుప్రేమికులు ఒకవైపు ఎంత మొత్తుకుంటున్నా.. కొందరు మాత్రం ఇలా మూర్ఖంగా ప్రవర్తించడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల పట్ల జాలి చూపండ్రా అంటూ.. సదరు కుర్దీస్తానీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top