ప్రముఖ గాయకుడు కెన్నీ రోజర్స్ కన్నుమూత

న్యూయార్క్ : అమెరికన్ ప్రముఖ గాయకుడు కెన్నీ రోజర్స్ (81) కన్నుమూశారు. ఆరు దశాబ్ధాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలుగించిన కెన్నీ గొంతు మూగబోయింది. కెన్నీ రోజర్స్ సహజ మరణం పొందినట్లు ఆయన కుటుంసభ్యులు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. 1938 ఆగస్ట్ 21న జన్మించిన ఆయన మూడు గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్నారు. కెన్నీ మృతి పట్ల ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి