నా బిడ్డకు తండ్రి ఎలన్‌ మస్క్‌: సింగర్‌

Musician Grimes Says Elon Musk Is Father Of Her Child - Sakshi

తనకు పుట్టబోయే బిడ్డకు స్పేస్‌ఎక్స్‌, టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్ తండ్రి అని ఆయన ప్రియురాలు, ప్రముఖ కెనడా సింగర్‌ క్లేర్‌ బౌచర్‌ తెలిపారు. తాను ఇప్పుడు గర్భవతినని, ఎలన్‌ మస్క్‌తో కలిసి త్వరలోనే తమ జీవితాల్లోకి బిడ్డను ఆహ్వానించబోతున్నట్లు వెల్లడించారు. అయితే బిడ్డకు జన్మనివ్వడం గురించి తానెప్పుడూ ఆలోచించలేదని.. ఇదొక పిచ్చి త్యాగం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి క్లేర్‌ బౌచర్‌ రోలింగ్‌ స్టోన్‌తో మాట్లాడుతూ... ‘‘ ప్రతీ అమ్మాయి తన శరీరంపై స్వాతంత్ర్యాన్ని కోల్పోతుంది. ఇది నిజంగా క్రేజీగా ఉంది. ప్రపంచంలోని సగం జనాభా మాత్రమే ఇలాంటి త్యాగం చేస్తారు. నాకైతే ఈ విషయం ఎంతో లోతైనదిగా అనిపిస్తోంది. ఇప్పుడు నా శక్తిని నేను త్యాగం చేస్తున్నా. ఎవరికో లొంగిపోయినట్లుగా అనిపిస్తుంది. అసలు నా జీవితంలో ఇలాంటి ఓరోజు వస్తుందని ఊహించలేదు. ఇదో కమిట్‌మెంట్‌ అంతే. అయితే నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను నేను అమితంగా ప్రేమిస్తాను’’అని చెప్పుకొచ్చారు.(టెస్లా సీఈవో స్టెప్పులు, వీడియో వైరల్‌)

కాగా విజువల్‌ ఆర్టిస్టు, రికార్డు ప్రొడ్యూసర్‌, గాయనిగా గుర్తింపు పొందిన 31 ఏళ్ల క్లేర్‌ బౌచర్‌.. గ్రిమ్స్‌ అనే పేరుతో పాపులరయ్యారు. 2018 నుంచి ఎలన్‌ మస్క్‌తో డేటింగ్‌ చేస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్నారు. ఇక ఆమెకు ఇది మొదటి సంతానం కాగా.... ఎలన్‌ మస్క్‌కు ఇప్పటికే ఐదుగురు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య జస్టిన్‌తో ఆయనకు కలిగిన సంతానం వీరు. కాగా ఇటీవల లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన గేమ్ అవార్డ్స్‌లో గ్రిమ్స్‌ తన కొత్త సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వేడుకకు హాజరైన ఎలన్‌ మస్క్‌ ఆమెను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top