దొంగతనం ఫెయిల్‌.. గాల్లోంచి ఊడిపడ్డాడు!

Robbers Fall Out From The Second Floor In New York Hotel - Sakshi

న్యూయార్క్‌: చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా అమెరికాలో నలుగురు దొంగలు చోరికి విఫలయత్నం చేశారు.. తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఓ దొంగ రెండో అంతస్తుమీద నుంచి కిందకు దూకి చేయి విరగ్గొట్టుకున్నాడు. ఈ సంఘటన న్యూయార్క్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల ఫిబ్రవరి 24న నలుగురు దొంగలు న్యూయార్క్‌ క్వీన్స్‌లోని 95వ వీధిలో ఉన్న హోటల్‌ 95లో దొంగతనం చేయటానికి వెళ్లారు. హోటల్‌లోకి ప్రవేశించిన వారు నేరుగా సూట్‌ రూమ్‌ తలుపు తట్టారు. ఓ 20ఏళ్ల యువకుడు తలుపు తీయగా అతన్ని కొట్టి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. అతడు తీవ్రంగా ప్రతిఘటించటంతో వెనక్కు తగ్గారు. అక్కడినుంచి పారిపోవటానికి ప్రయత్నించారు.

ఎన్‌ఐపీడీ విడుదల చేసిన సీసీటీవీ వీడియో దృశ్యాలు

ముగ్గురు దొంగలు వచ్చిన దారిలోనే పరుగు తీయగా.. ఓ దొంగ మాత్రం అక్కడి రెండో అంతస్తుమీద నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి చేయి విరిగిపోయింది. అయినా పైకిలేచి పక్కన పడిన తన జెర్కిన్‌ తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. న్యూయార్క్‌ పోలీసులు ఈ దొంగతనానికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా దొంగ గాల్లోంచి ఊడిపడ్డట్టు ఉన్న దృశ్యంపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top