ఒక్కరోజులో 738 మంది మృతి 

Spain Corona Death Toll Super Passes China - Sakshi

స్పెయిన్‌ : కరోనా వైరస్‌ విజృంభనతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. లాక్‌డాన్‌ ప్రకటించుకుని నాలుగు గోడల మధ్య మగ్గిపోతున్నాయి. అయినప్పటికి వైరస్‌ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్‌లో పరిస్థితులు మరింత భీతావహంగా ఉన్నాయి. వైరస్‌ మరణాల సంఖ్య కరోనా పుట్టిల్లు చైనాను దాటిపోయింది. చైనాలో ఇప్పటివరకు 3,285 మంది మృతి చెందగా, స్పెయిన్‌లో ఈ సంఖ్య 3,434గా ఉంది. నిన్న ఒక్కరోజే 738మంది మరణించినట్లు అక్కడి పత్రికలు నివేదించాయి. కాగా, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 15వేలకు పైగా మరణించగా, 4లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. 6వేల కరోనా మరణాలతో ఇటలీ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది.

చదవండి : మరోసారి భారీ ఎత్తున మాస్క్‌ల పట్టివేత

జర్నలిస్టుకు కరోనా పాజిటివ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top