యూకే విద్యార్థి వీసాల్లో మనోళ్లే టాప్‌

UK Immigration Stats: Indian Student Visas up By 93 Percent - Sakshi

లండన్‌: బ్రిటన్‌ విద్యార్థి వీసా పొందిన విదేశీయుల్లో భారతీయులు తొలిస్థానంలో నిలిచారు. ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) వెలువరించిన గణాంకాల ప్రకారం 2019లో 37,500 మంది భారతీయ విద్యార్థులకు టయర్‌–4(విద్యార్థి) వీసాలు దక్కాయి. 8 ఏళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. వృత్తి నిపుణులకిచ్చే టయర్‌–2 వీసాల్లో సగం భారతీయులకే దక్కాయి. ఈ విభాగంలో భారతీయులు 57వేల వీసాలతో టాప్‌లో నిలిచారు. గత ఏడాది 5.15 లక్షల మంది భారతీయులకు పర్యాటక వీసా ఇచ్చినట్లు తెలిపింది. అంతకు ముందుతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని వివరించింది.

మొత్తమ్మీద భారతీయుల వీసా దరఖాస్తులను 95 శాతం వరకు ఆమోదించినట్లు తెలిపింది. బ్రిటన్‌కు వలసలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి తగ్గిపోగా, మిగతా దేశాల నుంచి క్రమేపీ పెరుగుతున్నట్లు వివరించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానంతో కూడా భారతీయులకు లాభం కలుగుతుందని తెలిపింది. (చదవండి: హ్యాపీనెస్‌ క్లాస్‌పై మెలానియా ట్వీట్‌..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top