ఒంటిరిగా ఉండటానికి భయపడుతున్నారా?

Signs That You Are Scared Of Being Alone - Sakshi

మనం ఎవరితోనైనా ప్రేమలో పడగానే వారితో రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాలని కోరుకోవటం పరిపాటి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తిపై నమ్మకం, వారు పాటించే విలువులు, ఇద్దరి మధ్యా సామీప్యతలు బంధంలోకి అడుగుపెట్టడానికి కారణాలుగా కనిపిస్తాయి. అయితే చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టంలేక..భయపడి ప్రేమబంధంలోకి అడుగుపెడతారు. అలాంటి వారు తమ భాగస్వామి ఇతరుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించినా తట్టుకోలేరు. స్వార్థపూరితమైన బంధం ఎక్కువకాలం నిలవలేదన్న విషయాన్ని గుర్తించలేరు. ఓ వ్యక్తి ఒంటరిగా ఉండటానికి ఇష్టంలేక.. భయపడి ప్రేమబంధంలోకి అడుగుపెట్టారని చెప్పే కొన్ని లక్షణాలు.. 

1)కామన్‌ థింగ్స్‌ !
 ఇష్టపడే ఆహారం​, నచ్చే హీరో, ప్రదేశాలు.. హాబీస్‌ ఇలా ఏ విషయంలోనైనా ఓ జంట మధ్య చాలా పోలికలు ఉన్నట్లయితే కుటుంబమో.. స్నేహితులో.. మీ మధ్య చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయంటూ పొగడటం మామూలే. అయితే ఎవరైనా మీ జంటలోని మీ ఇద్దరి మధ్య కామన్‌ థింగ్స్‌ ఏంటంటూ మిమ్మల్ని అడిగారనుకో.. అవేంటో చెప్పటానికి మీరు బుర్ర బద్ధలు కొట్టుకుంటుంటే మటుకు మీరు ఒంటరిగా ఉండలేక బంధంలోకి అడుగుపెట్టారనడానికి సూచన.

2) అభద్రతా భావం
ఓపెన్‌గా చెప్పటానికి మీరు ఇబ్బంది పడొచ్చుకానీ, మీ పార్ట్‌నర్‌ ఎవరితోనైనా చనువుగా ఉంటే మాత్రం మీరు తట్టుకోలేరు. మాటలో​ వర్ణించలేని ఈర్ష్యతో రగిలిపోతారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తారోనన్న భయంతో అల్లాడిపోతారు. ఇది మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారనడానికి సూచన

3) ఎదుటి వ్యక్తి సంతోషం కోసం.. 
ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడానికి మీకు సంబంధించిన కొన్ని విషయాల గురించి అబద్ధాలు చెబుతున్నారా? అవునంటే! మీలోని కొన్ని లక్షణాలు ఎదుటి వ్యక్తికి నచ్చవన్న భావన మీకు ఉన్నట్లు గుర్తించాలి. వాటి వల్ల మీ బంధానికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయం మీకు కచ్చితంగా ఉండిఉంటుంది. ఇలా అయితే గనుక మీ బంధం గురించి ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

4) భాగస్వామి పక్కనలేకపోతే.. 
మీ పార్ట్‌నర్‌ మీకు దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారా?.. ‘నన్ను విడిచి దూరంగా వెళ్లొద్దు’ అంటూ ఆమె/అతడితో గొడవపడుతున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండలేక ప్రేమ బంధంలోకి అడుగుపెట్టారని కచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామి మీ ఫోన్‌ కాల్స్‌కు రిప్లై ఇవ్వకుండా, మీ స్నేహితులతో చనువుగా ఉన్నపుడు ఏదో కోల్పోయిన వారిలా ఒంటరిగా ఫీల్‌ అవుతుంటే ఆలోచించాల్సిన విషయమే.. ఇలాంటి ప్రవర్తన మీ బంధాన్ని ఇరకాటంలో పడేస్తుందని గుర్తించండి.

5) భాగస్వామితో బంధం ఓ పెద్ద అచీవ్‌మెంట్‌! 
మీ భాగస్వామితో బంధంలోకి అడుగుపెట్టడమే ఓ పెద్ద అచీవ్‌మెంట్‌లా ఫీలవతున్నారా? ఇతరుల ఎదుట మీరు ఒంటరివారు కాదని నిరూపించుకోవటానికి పరితపిస్తున్నారా? మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టివెళ్లకుండా ఏ విధంగా ఇబ్బందిపెట్టినా పర్లేదనుకుంటున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండటానికి భయపడేవారని గుర్తించండి.లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top