గుడ్‌ఫ్రైడేపై సిస్టర్‌ విమలారెడ్డి సందేశం

Sister YSR Vimala Reddy Gave Message About Good Friday Speciality - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుడ్‌ఫ్రైడే... ! ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు. ప్రభువు ప్రాణత్యాగానికి గుర్తు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ మాసంలో వచ్చే ఈ పండుగను క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పండుగకు 42 రోజుల ముందు నుంచే క్రైస్తవులు అంతా ఉపవాసాలు చేయడం, రోజులో నాలుగు నుంచి అయిదు సార్లు ప్రార్థనలు చేస్తారు. భారతీయ క్రైస్తవులు ఈ రోజును శుభ శుక్రవారంగా పిలుచుకుంటారు. పండుగ రోజున చర్చీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలో  క్రైస్తవులంతా  ఉపవాసంతో  పాల్గొం‍టారు.

ప్రభువు శిలువ వేయబడిన రోజు శుభ దినం ఎలా అవుతుంది? అసలు దీనికి శుభ శుక్రవారం అని క్రైస్తవులు ఎందుకు పిలుచుకుంటారని చాలా మందికి ఉండే సందేహాలే.  అంతే కాకుండా శుభ శుక్రవారం రోజున క్రైస్తవులు ఏం చేస్తారు? అసలు క్రీస్తును శిలువ ఎందుకు వేశారు వంటి అనేక సందేహాలకు సమాధానంగా సిస్టర్‌ వైఎస్‌ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. పండుగ ప్రత్యేకతను, ఏసు శిలువ వేయబడిన తర్వాత శిలువపై ఆయన పలికిన ఏడు అంశాల గురించి ఆమె సమగ్రంగా వివరించారు. శుభ శుక్రవారంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top