మీ బంధం కలకాలం నిలబడాలంటే..

Things To Do For Better Relationship - Sakshi

ప్రేమ, పెళ్లి.. ఏదైనా కావచ్చు! ఇష్టంతో ఓ ఇద్దరు వ్యక్తులు బంధంలో అడుగుపెట్టడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కానీ, ఆ బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవటానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. వేరువేరు మనస్తత్వాల్తో, ఆలోచనల్తో బంధాన్ని ఏ గొడవల్లేకుండా కొనసాగించటం మామూలు విషయం కాదు. ఏదో ఒక చిన్న విషయానికి నిత్యం తగాదా పడే జంటలు కోకొల్లలు. వారు తమ అహాలను సంతృప్తి పరుచుకోవటానికి దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆలోచిస్తారే తప్ప ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాల గురించి ఆలోచించరు. అయితే అలాంటి వారు కొన్ని సూత్రాలను పాటిస్తే బంధానికేమీ బీటలు బారవు. 

1) భావోద్వేగపూరిత బంధం 
బంధం కలకాలం కలతలు లేకుండా కొనసాగటానికి వ్యక్తుల మధ్య నిరంతరం భావోద్వేగాలు కొనసాగుతుండాలి. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లుగా ప్రేమ ఉండకూడదు. రోజులు గడుస్తున్న కొద్ది ప్రేమ బలహీన పడకుండా మరింత బలపడాలి. ఎమోషనల్‌గా వ్యక్తులు దగ్గరగా లేనపు​డు వారి మధ్య భౌతికంగా కూడా దూరం పెరుగుతుంది.

2) పాజిటివ్‌ ఆలోచనలు
జంట మధ్య ఎల్లప్పుడు అనుకూల వాతవరణం ఉండాలి. అలాలేని జంటల బంధం తొందరగా బలహీనపడుతుంది. గొడవలు జరిగినపుడు వెంటనే సర్దుకుపోగలగాలి. అహాలను పక్కన పెట్టి ముందకు సాగాలి. గొడవలకు గల కారణాలను అన్వేషించాలి. తరచూ తగాదాలకు దారి తీస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చే కాంప్లిమెంట్స్‌ కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అవి మనకు వారిపై ఉన్న ప్రేమను, ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి.

3) మనసు కాదు బుద్ధి ముఖ్యం
మనసుతో కాకుండా బుద్ధితో ఆలోచించగలిగే జంటలే ఎక్కువ సంతోషంగా ఉంటున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇందులో ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవటం అన్న విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సృష్టిలో లోపాలు లేని మనిషంటూ ఉండడు. భాగస్వామిలో కూడా మనకు నచ్చని గుణాలు ఉండవచ్చు. అయితే వాటి విషయంలో సర్దుకు పోవటం అన్నది చాలా అవసరం. భాగస్వామిలోని కొన్ని అవలక్షణాల గురించి పట్టించుకోకపోటమే మన మనసుకు, శరీరానికి, బంధానికి మంచిది. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top