హై ఓల్టేజ్‌ యాక్షన్‌

Actor Jithan Ramesh to play a villain in Vamsi Krishna Malla new movie - Sakshi

సాయిరోనక్, ఎనా సహా జంటగా వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నిరీక్షణ’. టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై పి.రాజన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఆర్‌.బి. చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్‌ తొలిసారి మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఫైట్స్‌ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్, ‘రాక్షస..’ అనే ప్రమోషనల్‌ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించగా రోల్‌ రిడా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రద్ధాదాస్, సన ప్రత్యేక పాత్రలు చేస్తున్న ఈ  చిత్రానికి కెమెరా: రవి వి., సంగీతం: ‘మంత్ర’ ఆనంద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top