ప్రముఖ నటి ఇంట గ్రాండ్‌గా రిసెప్షన్

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం స్థానికంగా జరిగిన ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ, నటుడు మోహన్‌బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇతర టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమృత కౌర్‌తో నిహార్ వివాహం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సీనియర్ నటీమణులు జయప్రద, రాధిక తదితరులు హాజరై సందడి చేశారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ ఇద్దరు కుమారులున్నారు. నిహాన్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. నటి జయసుధ ఇటు వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి