సీనియర్ నటి నిమ్మి కన్నుమూత

ముంబై : ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి నవాబ్ బానూ(నిమ్మి) కన్నుమూశారు. బుధవారం గుండెపోటు రావడంతో ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నిమ్మి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. సీనియర్ నటులు మహేష్ భట్, రిషి కపూర్ నిమ్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1950, 1960 దశకాలలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. మంచి నటిగా గుర్తింపు సాధించారు. 1949లో రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బర్సాత్ సినిమాతో నిమ్మీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కాగా, నిమ్మి అంత్యక్రియలు గురువారం రే రోడ్డులోని స్మశాన వాటికలో జరగనున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి