కరోనాకు బలైన హీరోయిన్‌ తండ్రి

Actress Sophia Myles Father Died With Corona - Sakshi

లండన్‌ : ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌(67) కరోనా బారిన పడి కన్నుమూశారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కొద్దిరోజుల కిత్రం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇతర వ్యాధుల కారణంగా కోలుకోలేకపోయిన ఆయన శనివారం మరణించారు. తండ్రి మరణించిన విషయాన్ని సోఫియా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ ఆర్‌ఐపీ పీటర్‌ మైల్స్‌ . మా నాన్న కొన్ని గంటల క్రితమే మరణించారు. కరోనా వైరస్‌ కారణంగానే ఆయన చనిపోయార’ని పేర్కొన్నారు.

తండ్రి పీటర్‌ మైల్స్‌తో సోఫియా

ఆసుపత్రిలో తండ్రి మృతదేహం వద్ద దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలియజేస్తున్న ఆమె కొద్దిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ‘అందరినీ హెచ్చరిస్తున్నాను. కరోనా వ్యాధి సోకిన మా నాన్న ప్రత్యేక వార్డులో ఉంచబడ్డారు. అక్కడ అందరూ కరోనా బాధితులే. ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. వారిలో అందరూ వృద్ధులే. దయచేసి కరోనాను సీరియస్‌గా తీసుకోండ’ని ఆ వీడియాలో విజ్ఞప్తి చేశారు. కాగా, యూకేలో ఇప్పటివరకు 5,018 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 233 మంది మరణించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top