కిలాడి నంబర్‌ 4

Akshay Kumar takes 4th spot in Forbes highest paid actors - Sakshi

బాలీవుడ్‌ కిలాడి (అక్షయ్‌ని ముంబైలో అలానే అంటారు) అక్షయ్‌ కుమార్‌ ఫోర్బ్స్‌ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజీన్‌ ఫోర్బ్స్‌ 2019 ఏడాదికిగాను అత్యధిక సంపాదన ఉన్న నటుల జాబితాను ప్రకటించింది. గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు నటుల సంపాదనను వివిధ కొలమానాల ఆధారంగా చేసుకుని ఈ జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 65 మిలియన్‌ డాలర్ల (దాదాపు 460 కోట్ల రూపాయలు) సంపాదనతో ఈ జాబితాలో అక్షయ్‌ కుమార్‌ నాలుగో స్థానంలో నిలిచారు.

హాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ డ్వేన్‌ జాన్సన్‌ 89.4 మిలియన్‌ డాలర్ల సంపాదనతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 76.4 మిలియన్‌ డాలర్లతో క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో రాబర్ట్‌ డౌనీ జూనియర్, జాకీ చాన్, బ్రాడ్లీ కూపర్, ఆడమ్‌ సాండ్లర్, క్రిస్‌ ఇవాన్స్, పాల్‌ రూడ్, విల్‌ స్మిత్‌లు వరుస క్రమంలో చోటు సంపాదించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన జార్జి క్లూనే ఈసారి చోటు సంపాదించుకోలేకపోయారు. మరోవైపు 2015 తర్వాత బ్రాడ్లీ కపూర్‌ ఈ జాబితాలో తిరిగి స్థానం సంపాదించుకోవడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top