ఆర్ఆర్ఆర్.. మరో ఇంట్రస్టింగ్ న్యూస్!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. చారిత్రక కథకు ఫిక్షన్ జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో కీలక పాత్రలో స్వీటీ అనుష్క నటించనున్నారట. కీలక సందర్భంలో మూడు నాలుగు నిమిషాల పాటు అనుష్క కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించిన స్వీటీ, ఆర్ఆర్ఆర్లో కూడా నటిస్తుందన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సైజ్ జీరో సినిమా తరువాత లుక్స్‌పరంగా విమర్శలు ఎదుర్కొన్న అనుష్క, ఇటీవల తిరిగి గ్లామరస్ లుక్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైలెన్స్’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తరువాత వరుసగా భారీ చిత్రాలకు రెడీ అవుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి