మంచి కామెడీ

సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించారు. ఈ చిత్రంలోని రెండవ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘పాట చాలా బాగుంది. తప్పకుండా ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది’’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది.
హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా బాగా నటించారు. దసరాకి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి, దర్శకులు విశ్వనాథ్‌గారు రిలీజ్ చేసిన మొదటి గీతానికి మంచి స్పందన వచ్చింది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ‘‘చలపతి కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి