అఘోరాగా బాలయ్య.. ఇది నిజమేనంటా

Boyapati Sreeni Gives Clarity On Balakrishna Aghora Character - Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను దర్శక​త్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారని లీకువీరులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ వారణాసిలో జరపుకోవడంతో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ బోయపాటి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.    

‘మా కాంబినేషన్ లో అభిమానులు ‘సింహా’ చూశారు. ఆ తర్వాత ‘లెజెండ్’ చూశారు. ఈసారి అంతకుమించి కొత్తదనం చూపించాలని అందుకే వందశాతం కష్టపడుతున్నాం. కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను.  ఈ కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు. అభిమానులను కనువిందు చేస్తారు. ఇక అఘోరా విషయానికి వస్తే అఘోరా టైపు క్యారెక్టర్ ఉన్నమాట వాస్తవమే. అయితే దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే’అంటూ బోయపాటి పేర్కొన్నారు. దీంతో ఈ కొత్త చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించడం ఫిక్సని అర్థమయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అంజలి ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

చదవండి:
‘ప్రభాస్‌-అమీర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలి’
నిహారిక, యశ్‌ల డ్యాన్స్‌ చూశారా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top