‘బుట్ట బొమ్మ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Butta Bomma Full Video Song Released - Sakshi

అల వైకుంఠపురములో నుంచి జాలువారిన పాటల తోరణాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేసాయి. సినిమా విడుదలై నెల రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఫోనులో మోగుతూనే ఉన్నాయి, అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అందరితో స్టెప్పులేయించిన పాట ‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. నన్ను సుట్టూకుంటివే’ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మ్యాజిక్‌ ఈ పాటలో ఉంది. అందుకే, ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.(డబుల్‌ ధమాకా)

అందరి మదులను దోచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, థమన్‌ సంగీతమందించాడు. ఇక ఈ పాటను అర్మన్‌ మాలిక్‌ అద్భుతంగా ఆలపించాడు. ఇక యూట్యూబ్‌లోనూ రికార్డులు బద్దలు కొట్టిన ఈ సాంగ్‌ పూర్తి వీడియో తాజాగా విడుదలైంది. ఇంకేముంది.. కొద్ది గంటల్లోనే ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. మరోసారి తన రికార్డులను తానే తిరగరాసే దిశగా దూసుకుపోతోంది. కాగా అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. (మరో మార్కును చేరుకున్న‘అల వైకుంఠపురములో’)

పాట పూర్తి లిరిక్స్‌ మీకోసం
ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మూ..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదునమ్మూ..
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటన్నానే అమ్మూ..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మూ..
ఎట్టాగా నే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
అరె దేవుడా.. ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..
బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. నన్ను సుట్టూ కుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2"

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నా గానీ అమ్మూ..
లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్మూ..
రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..

చిన్నగా సినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా.. ఓ మల్లెపూవునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. నన్ను సుట్టుకుంటివే..
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే..
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే..
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మూ..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్మూ..
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మూ..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మూ..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top