సీక్వెల్‌లో స్వాతి

Colors Swathi Planning To Make A Grand Re-entry - Sakshi

పెళ్లి చేసుకున్న తర్వాత స్వాతి సినిమాల్లో కనిపించరేమో అని భావించారంతా. ‘స్క్రిప్ట్‌ కుదిరితే మళ్లీ నటిస్తా’ అని ఆ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి పేర్కొన్నారు. అన్నట్లుగానే  స్క్రీన్‌ మీద కనిపించడానికి రెడీ అయ్యారామె. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, స్వాతి జంటగా కనిపించిన చిత్రం ‘కార్తికేయ’.

2014లో రిలీజ్‌ అయిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ సూపర్‌ హిట్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు చందు. ఈ సీక్వెల్‌లోనూ నిఖిల్, స్వాతి జంటగా నటిస్తారని తెలిసింది. పెళ్లి తర్వాత స్వాతి చేయబోయే మొదటి సినిమా ఇదే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top