కరోనా భయం: స్వీయ నిర్బంధంలో ప్రియదర్శి!

Covid 19 Actor Priyadarshi Self Quarantined After Return From Georgia - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాంతక కరోనా (కోవిడ్‌) వ్యాప్తి నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులకు దూరంగా ఉండటమే మేలైన మార్గాలని పలు పరిశోధనలు, వైద్యశాస్త్ర నిపుణులు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ప్రభాస్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు జార్జియా వెళ్లిన ఆయన షూటింగ్‌ ముగించుకుని వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ అనంతరం ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయారు. తనకు తాను క్లీన్‌ చిట్‌ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రియదర్శి నిర్ణయించుకున్నారు.
(చదవండి: బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్‌ చేసిన చెర్రీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top