లక్కీవాలా

Dilli Wala song release from Disco Raja - Sakshi

రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ కథానాయికలుగా నటించారు. రామ్‌తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమాలోని ‘‘ఢిల్లీవాలా.. ఢిల్లీవాలా...హ్యాపీ గో లక్కీవాలా’ అనే పాటను శనివారం విడుదల చేశారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్‌ నంబియార్‌ పాడారు. ఈ సినిమాకు తమ¯Œ  సంగీతం అందించారు. ఇది హీరో ఇంట్రడక్ష¯Œ  సాంగ్‌ అని చిత్రబృందం పేర్కొంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ సింహా, ‘వెన్నెల’ కిశోర్, సత్య కీలక పాత్రలు పోషించారు. ‘డిస్కోరాజా’ చిత్రం జనవరి 24న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top