తండ్రీకూతుళ్లుగా...

Father And daughter film for Amitabh Bachchan and Katrina Kaif - Sakshi

అమితాబ్‌ బచ్చన్, కత్రినా కైఫ్‌ త్వరలోనే తండ్రీ కూతుళ్లు కానున్నారట. తండ్రీ–కూతుళ్ల బంధం మీద బాలీవుడ్‌ దర్శకుడు వికాశ్‌ బాల్‌ ‘డెడ్లీ’ అనే చిత్రాన్ని  తెరకెక్కించనున్నారు. అంత్యక్రియల కార్యక్రమం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందట. ఇందులో అమితాబ్‌ బచ్చన్, కత్రినా తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ తమ అంగీకారాన్ని తెలిపారట బచ్చన్, కత్రినా. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను కొన్నిరోజులు ఆగి ప్రారంభించాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top