తొమ్మిది గంటల్లో...

చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా న టించిన చిత్రం ‘హవా’. 9 గంటలు, 9 బ్రెయిన్స్, 9 నేరాలు అనేది ట్యాగ్‌లైన్. ఫిల్మ్ అండ్ రీల్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేశ్ రెడ్డి దర్శకుడు. సినిమా అంతా 9 గంటల్లో జరిగే స్టోరీ కావటం విశేషం. ఈ చిత్రాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానున్న ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు నిర్మాత, నటి లక్ష్మీ మంచు.
లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మేకింగ్ చాలా గ్రాండియర్‌గా ఉంది. థీమ్ సాంగ్ పిక్చరైజేషన్ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు. ‘‘నా పాత్ర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు దివి ప్రసన్న. ‘‘ఈ థీమ్ సాంగ్ చిత్రానికి హైలెట్’’ అన్నారు చైతన్య మాదాడి. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లక్ష్మీప్రియాంక రాసిన థీమ్ సాంగ్ ఇది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హవా’ ప్రేక్షకులను ఎక్కడా రిలాక్స్ అవనివ్వని కథనం హైలెట్‌గా ఉంటుంది’’ అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి