పైరేటెడ్ లవ్ స్టోరీ

నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ జంటగా ‘అడ్డా’ ఫేమ్ జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో హీరోయిన్’. స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘ఫార్వార్డ్..’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘పైరేటెడ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘ఫార్వార్డ్..’ అంటూ అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే పాట క్యాచీగా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది’’ అని చిత్రబృందం పేర్కొంది. డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణమురళి, ‘30 ఇయర్స్’ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వంశీకృష్ణ.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి