కొత్త కాన్సెప్ట్‌

Hulchul Movie Trailer Launched By Sandeep Reddy Vanga - Sakshi

రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్‌ చల్‌’. గణేష్‌ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ బాగుంది. కాన్సెప్ట్‌ కొత్తగా ఉందనిపిస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు తప్పకుండా సినిమా చూస్తారు’’ అన్నారు. ‘‘మూడు సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నిర్మించిన ఈ చిత్రాన్ని  ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఎమ్‌ఎస్‌కె డిజిటల్‌ ద్వారా మల్కాపురం శివకుమార్‌గారు మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు’’ అన్నారు గణేష్‌ కొల్లూరి. ‘‘మంచి కథతో కూడిన ఇలాంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రుద్రా„Š . ‘‘సరికొత్త కథతో రూపొందిన చిత్రమిది. గణేష్‌గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’’ అన్నారు శ్రీపతి కర్రి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top