ఇర్ఫాన్‌ చివరి వరకు పోరాడాడు

Irrfan Khan Fought Till The End: Yuvraj Singh - Sakshi

ముంబై: విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్‌ చివరి వరకు పోరాడాడని, ఆ బాధ తనకు తెలుసునని యువీ అన్నాడు. ‘ఈ ప్రయాణం గురించి నాకు తెలుసు. నొప్పి గురించి తెలుసు. చివరి వరకు అతను పోరాడాడని నాకు తెలుసు. కొంతమంది అదృష్టం బాగుండి మనుగడ సాగిస్తారు. కొంత మంది ప్రయాణం ఎంతవరకు సాగుతుందో కచ్చితంగా చెప్పలేం. ఇర్ఫాన్‌ ఖాన్‌ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాల’ని యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. 

యువీ కూడా క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అతడికి క్యాన్సర్‌ సోకినట్టు 2011 వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో బయటపడింది. అయినప్పటికీ పట్టుదలతో ఆడిన యువీ.. టీమిండియాను 28 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కించుకుని అందరి మన్ననలు పొందాడు. (ఇర్ఫాన్‌ ప్రేమకథ; కాలేజీ నుంచి కడవరకు..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top