తెగ సంబరపడిపోతున్న కాజల్‌

Kajal Aggarwal Wax Statue In Madame Tussauds - Sakshi

దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. 12 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. రేపు(ఫిబ్రవరి 05) ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ క్రమంలో కాజ‌ల్ వీడియో ద్వారా విష‌యాన్ని నెటిజ‌న్స్‌కి చేర‌వేసింది. త‌న విగ్ర‌హాన్ని మేడం టుస్సాడ్స్ లో పెడుతున్నందుకు  సంతోషంగా ఉందని,  దీనికోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానంటూ ఓ వీడియోని ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. 

ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, డార్లింగ్‌ ప్రభాస్‌ సరసన చందమామ విగ్రహం కూడా చేరనుండతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోంది.

ప్రముఖుల మైనపు విగ్రహాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మేడమ్‌ టుస్సాడ్‌. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటీనటుల విగ్రహాల్ని ఒకేచోట ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ విగ్రహాలు ఈపాటికే అక్కడ కొలువుదీరాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top