దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

Kajol Agarwal requests Indians to Support our own brands - Sakshi

ముంబై : కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో రాబోయే రోజుల్లో భారతీయ వ్యాపారస్తులకు అండగా నిలవాలని నటి కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ దెబ్బకు ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో వ్యాపారస్తుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 

'కరోనా మహమ్మారి అంతరించిన తర్వాత, మన దేశం కోసం ఓ మంచి పని చేద్దాం. భారతదేశంలోనే విహార యాత్రలకు వెళ్దాం. స్థానిక రెస్టారెంట్లలోనే తిందాం. స్థానికంగా పండించే పళ్లనే కొందాం. భారతీయ బ్రాండ్ల బట్టలు, షూలనే కొని స్థానిక వ్యాపారులకు అండగా నిలుద్దాం. ఈ వ్యాపారాలన్నీ రానున్న రోజుల్లో గడ్డుకాలాన్ని ఎదుర్కోబోతున్నాయి. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడే వరకు మనం అందరం వారికి అండగా నిలుద్దాం. ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ అభివృద్ధి చెందడంలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం'  అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top