ప్రొడ్యూసర్‌ కత్రినా

Katrina Kaif wants to don producer - Sakshi

కథానాయికలు ఇటీవల నిర్మాతలుగా మారడం మనం గమనిస్తూనే ఉన్నాం. బాలీవుడ్‌లో ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మలు సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కత్రినా కైఫ్‌ కూడా జాయిన్‌ కాబోతున్నారు. ఫ్రెంచ్‌ చిత్రం ‘హీ లవ్స్‌ మీ.. హీ లవ్స్‌ మీ నాట్‌’ హక్కులను కత్రినా తీసుకున్నారని, ఈ సినిమాను రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ విషయం గురించి కత్రినా మాట్లాడుతూ – ‘‘ఆ ఫ్రెంచ్‌ చిత్రకథ మీద కొంత కాలంగా వర్క్‌ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్‌ నన్ను చాలా ఎగై్జట్‌ చేసింది. ఈ సినిమాకు నిర్మాతగా నా పేరు వేసుకోబోతున్నాను. ఈ ఏడాదే  సినిమాని సెట్స్‌ మీదకు తీసుకెళ్తాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు కత్రినా నటించిన ‘భారత్‌’ జూన్‌ 5న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top