కీర్తి సురేష్‌ ‘మిస్‌ ఇండియా’ లిరికల్‌ సింగ్‌ రిలీజ్‌

Keerthy Suresh Miss India Movie Lyrical Song Release - Sakshi

నేను శైలజా చిత్రంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కీర్తి సురేష్‌. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఏ సినిమా చేసిన తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే కీర్తి ప్రస్తుతం మిస్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ మూవీలో నవీన్‌ చంద్ర, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. (కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!)

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా శుక్రవారం మూవీ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ పాటను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగే సారంగమై’ అంటూ సాగే ఈ పాటను మెలోడి క్వీన్‌ శ్రేయా ఘోషల్‌ పాడారు. కళ్యాణ్‌ చక్రవర్తి లిరిక్స్‌ రాయగా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. (తల్లి నటించిన చిత్రం సీక్వెల్‌లో కీర్తీ సురేశ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top