ముద్దిస్తే ఏడుస్తారా?

Love song from Sai Pallavi, Naga Chaitanya  Song launch - Sakshi

‘ఏయ్‌ పిల్లా...’ అని సాయి పల్లవిని ఉద్దేశించి పాడారు నాగచైతన్య. ఆ పాటకు పడిపోయినట్టున్నారు... చైతన్యకో చిన్న ముద్దిచ్చారామె. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్‌ దాస్, పి. రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘ఏయ్‌ పిల్లా..’ అంటూ సాగే ఫీల్‌గుడ్‌ వీడియో సాంగ్‌ను వేలంటైన్స్‌ డే స్పెషల్‌గా విడుదల చేశారు. ఈ పాటలో ‘ఏందబ్బా ముద్దుపెడితే ఏడుస్తారా అబ్బా?’ అని సాయి పల్లవి చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: విజయ్‌ సి. కుమార్, సహ నిర్మాత: భాస్కర్‌ కటకం శెట్టి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top