పార్టీ టైమ్

టాలీవుడ్‌లోని కొందరు అగ్రతారలు దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మహేశ్‌బాబు, ఎన్టీఆర్ తదితర తారలు పొల్గొ న్నారు. ‘‘మై డియర్ ఫ్రెండ్ మాలిని పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. క్లోజ్ ఫ్రెండ్స్’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్ వచ్చి పదిరోజుల హాలిడే ట్రిప్‌ను ప్లాన్ చేశారట మహేశ్. ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘బృందావనం’ చిత్రానికి వంశీపైడిపల్లే దర్శకుడు అనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ విధంగా ఎన్టీఆర్‌తోనూ వంశీకి మంచి అనుబంధం ఉంది. ‘మున్నా, ఎవడు, ఊపిరి’ వంశీ దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి