నీ పేరు ప్రేమదేశమా...

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమకథా చిత్రమ్ 2’ ఫేమ్ నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనులను కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమదేశమా..’ అంటూ సాగే మెలోడీని విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సోషల్ మెసేజ్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. బాలాజీ రాసిన ‘కనులను కాపలాగా ఉంచా...’ పాటని అనుదీప్ దేవ్ చక్కగా పాడారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతం అందించారు. పాటకి చాలా మంచి స్పందన వస్తోంది. టీజర్ ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్లింది’’ అన్నారు. సత్య, మధునందన్, ‘షకలక’ శంకర్, శ్రీతేజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నా ఈ చిత్రానికి లెన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి