‘శ్వాస’ ఆగిపోయిందా?

Nikhil Movie Swasa Shelved - Sakshi

వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపించిన నిఖిల్‌ ఇటీవల తడబడ్డాడు. రీమేక్‌గా తెరకెక్కిన అర్జున్ సురవరం రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముందుగా టైటిల్ విషయంలో విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా తరువాత రిలీజ్ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా మరో వార్త అభిమానులను కలవరపెడుతోంది. కిషన్‌ కట్టా దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా ‘శ్వాస’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కథా కథనాల విషయంలో దర్శక నిర్మాతల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగానే ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top