కథే ప్రాణం

అల్లు వంశీ, ఇతీ ఆచార్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పసివాడి ప్రాణం’. ధన్‌శ్రీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.ఎస్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లిరికల్ ఆడియో సాంగ్‌ను దర్శకులు కోదండరామిరెడ్డి, వీవీ వినాయక్‌లతో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రం ‘పసివాడి ప్రాణం’. మోషన్ క్యాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3డీ, 2డీ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. 2డీ బేబి, 3డీ టెడ్డీ బేర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు కథ ప్రాణం అయితే గ్రాఫిక్స్ ఊపిరి’’ అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి