22 పెద్ద విజయం సాధించాలి

– ప్రభాస్
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా నటించిన చిత్రం ‘22’. శివకుమార్ .బి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను ప్రభాస్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్ లిరికల్ వీడియో చూశాను. బాగుంది. బి.ఎ. రాజుగారు, జయగారి అబ్బాయి శివకుమార్‌కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. పోలీస్ డ్రెస్‌లో రూపేష్ బాగున్నాడు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్ మూవీ అనిపిస్తోంది. ‘22’ బిగ్ హిట్ కావాలి’’ అన్నారు.
‘‘ప్రభాస్ వంటì స్టార్ పోలీస్ డ్రెస్‌లో నేను బాగున్నానని చెప్పడాన్ని అవార్డులా భావిస్తున్నా’’ అన్నారు రూపేష్. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చెప్పారు నిర్మాత సుశీలాదేవి. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ను ప్రభాస్‌గారు అడిగి తెలుసుకుని కథలో మంచి డెప్త్ ఉందన్నారు. బిగ్ హిట్ అవుతుందన్నారు. మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన రూపేష్‌గారికి థ్యాంక్స్. కాస్లర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ మ్యాడీ బాగా పాడారు’’ అన్నారు శివకుమార్.
‘‘మా అబ్బాయి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద విజయం సాధించాలన్న ప్రభాస్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు బి.ఎ. రాజు. ‘‘చంటిగాడు’తో గీతరచయితగా నన్ను పరిచయం చేశారు జయగారు. వారి అబ్బాయి శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు రాయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కాసర్ల శ్యామ్. ‘‘రూపేష్‌కి, శివకు ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు సాయి కార్తీక్. కెమెరామేన్ రవికిరణ్, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు, సింగర్ మ్యాడీ మాట్లాడారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి