రెడ్‌ టీజర్‌ వచ్చేది అప్పుడే

Red Teaser Will Release On February 28th - Sakshi

ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిశోర్‌ తిరుమల దర్శకుడు. ఇందులో రామ్‌ తన కెరీర్‌లోనే తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో హీరోను చూసిన అభిమానులు ‘సంథింగ్‌ ఇంట్రెస్టింగ్‌’ అంటూ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నారు. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ‘రెడ్‌’ సినిమా టీజర్‌ విడుదలకు చిత్రయూనిట్‌ ముహూర్తం ఖరారు చేసింది. (రొమాంటిక్‌కి గెస్ట్‌)


ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటలకు టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో హీరోహీరోయిన్లపై పాటను చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రెడ్‌ కావడం విశేషం. కొన్నిపాటలు, కీలక సన్నివేశాలను ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్‌ రెడ్డి, ఫైట్స్‌ కొరియోగ్రఫీ: పీటర్‌ హెయిన్స్‌ (పది వేల అడుగుల ఎత్తులో...)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top