కరోనా: మేనల్లుడితో సరదాగా స్టార్‌హీరో

Salman Khan Busy With Nephew In Form And Katrina Kaif Busy In Home Chores - Sakshi

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమమైన సంగతి తెలిసిందే. ఇక ఏప్పుడు బిజీబిజీగా ఉండే స్టార్‌ హీరోలు సైతం ఇంట్లో ఉండటంతో ఈ విలువైన విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ కూడా ఇంట్లో తను సరదగా గడుపుతున్న వీడియోలను, ఫొటోలను నిరంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. గతంలో తను వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్‌ చేయగా.. తాజాగా గిన్నెలు కడుగుతూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. (జనతా కర్ఫ్యూ: ఆత‍్మతో అక్కడ ఉన్నాను)

అంతేగాక బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన మేనల్లుడు ఆహిల్‌ శర్మతో కలిసి ఫామ్‌లో సందడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఫామ్‌లో  తిరుగుతూ చెట్ల పండ్లను కోస్తూ ఆహిల్‌కు అందిస్తుంటే.. ఆహిల్‌ అత్యుత్సాహం చూపిస్తున్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని సల్మాన్‌ ఫ్యాన్స్‌ క్లబ్ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆహిల్‌ చాలా క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక అర్జున్‌కపూర్‌, అనన్య పాండేలతో పాటు  ఇతర సెలబ్రిటీలు సైతం ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫొటోలను నిరంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. (జనతా కర్ఫ్యూ.. ప్రభుత్వ సెలవు కాదు: సల్మాన్‌ ఖాన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top