గుడ్‌న్యూస్ చెబుతారా?

సమంత–నయనతార ఓ సినిమాలో కలసి నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నుంచి సమంత తప్పుకున్నారట. మరి.. గుడ్ న్యూస్ అన్నారేంటీ అనుకుంటున్నారా? సమంత ఓ గుడ్‌న్యూస్ చెప్పడానికే ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నారని టాక్. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమంత, నయనతారలను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే తల్లి కాబోతున్నారనే కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో నుంచి సమంత తప్పుకోవాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే ఆ గుడ్‌న్యూస్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి