ఈ కటౌట్‌కు సాటి లేదు!

సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రిరీలిజ్ వేడుకను ఈనెల 5న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ధియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెట్టిన మహేశ్‌బాబు 50 అడుగుల కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వెంకట పద్మావతి ధియేటర్ వద్ద పెట్టిన కటౌట్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల పాటు ఒడిశాలోనూ ప్రచారం పర్వం ఊపందుకోవడం విశేషం. అందరినీ అలరించేలా సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి